చెన్నై నుంచి టుటికోరిన్‌ వెళ్ళవలసిన విమానానికి తప్పిన ముప్పు

- August 07, 2016 , by Maagulf
చెన్నై నుంచి టుటికోరిన్‌ వెళ్ళవలసిన విమానానికి తప్పిన ముప్పు

చెన్నై నుంచి టుటికోరిన్‌ వెళ్లాల్సిన ప్రైవేటు విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయం 8:45 గంటలకు 50 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్‌ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో బయల్దేరిన గంటలోనే తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణీకులందరూ సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో నటుడు, స్టంట్‌ మాస్టర్‌ జాగర్‌ తంగం కూడా ఉన్నారు.
గత నెలలో ఇదే మార్గంలో ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com