గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!

- May 09, 2026 , by Maagulf
గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!

దోహా: 60కి పైగా దేశాలకు చెందిన 13-17 ఏళ్ల యువ కళాకారులకు సాధికారత కల్పించే అంతర్జాతీయ కార్యక్రమమైన టీన్ ఆర్ట్ అవార్డ్స్ డిజిటల్ షోకేస్‌కు కతారా కల్చరల్ విలేజ్ ఆతిథ్యం ఇచ్చింది.

ఈ కార్యక్రమం కళ మరియు డిజిటల్ ఆవిష్కరణల ద్వారా సాంస్కృతిక వైభవాన్ని బలపరుస్తుందని, కొత్త తరం సృజనాత్మకతను ప్రొత్సహిస్తుందని ఖతార్‌లోని బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ వసీం కుతుబ్ అన్నారు.

టీన్ ఆర్ట్ కార్యక్రమం సరిహద్దులకు అతీతంగా ఉమ్మడి సృజనాత్మకత ద్వారా వర్ధమాన ప్రతిభావంతులను అనుసంధానించే ఒక గ్లోబల్ ప్లాట్‌ఫామ్ అని ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు సీఈఓ డారియా కాలినినా అభివర్ణించారు.

ఈ సీజన్ థీమ్ అయిన "బిలాంగింగ్" (Belonging) ద్వారా ఐడేంటిటీ, హెరిటేజ్ మరియు మెమోరీ ఆవిష్కరిచడంతోపాటు ఖతార్ బహుళ సాంస్కృతిక స్వరూపాన్ని మరియు వర్ధమాన కళాత్మక ప్రతిభకు కేంద్రంగా నిలిచిందని వక్తలు ప్రశంసించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com