దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!

- May 09, 2026 , by Maagulf
దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!

మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్ లో లేబర్, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన పలువురిని ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆఫ్రికా మరియు ఆసియా దేశాలకు చెందిన 47 మంది ప్రవాసులు ఒమన్ లోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించి ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. 

కార్మిక చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని ప్రొత్సహించవద్దని పోలీస్ అధికారులు సూచించారు. చట్టాలకు విరుద్ధంగా ఉంటున్న వారి వివరాలు తెలిస్తే.. సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అధికారిక ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తెలియజేయాలని రాయల్ ఒమాన్ పోలీసులు పిలుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com