మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- May 09, 2026
కువైట్: మహబూలా ప్రాంతంలో వేర్వేరు ప్రదేశాలలో అక్రమంగా నడుస్తున్న ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ ను అహ్మదీ గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సీజ్ చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కువైట్ లో నిబంధనలను ఉల్లంఘించి ఈ స్టాల్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో సరైన ప్రమాణికత లేని ఆహార పదార్థాలు మరియు వినియోగ వస్తువులను విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్టాల్స్ ను నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరిపై ఇప్పటికే అరెస్టు వారెంట్లు ఉన్నాయని విచారణలో తేలిందన్నారు. ఉల్లంఘనదారులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తదుపరి చర్యల కోసం వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
ఉల్లంఘనలకు పాల్పడేవారిని, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో వివిధ ప్రాంతాలలో భద్రతా పరమైన తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్‌ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









