అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్పేస్‌ను డామినేట్ చేస్తూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ‘డెకాయిట్’
- May 09, 2026
అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్ పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.
థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది.
మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో అడివి శేష్‌కు ఉన్న విజన్ ని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథలు, బలమైన కథనాలతో ఆయనకు ఉన్న క్రేజ్ ‘డెకాయిట్’తో మరింత బలపడింది.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, ఇద్దరి నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
దర్శకుడిగా పరిచయమైన షనీల్ డియో ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ ధనుష్ భాస్కర్ విజువల్స్, కొదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి మరింత బలం చేకూర్చాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ చిత్రంలో ఉన్న హై ప్రొడక్షన్ వాల్యూస్ డిజిటల్ స్క్రీన్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
థ్రిల్లింగ్ కథనం, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో ‘డెకాయిట్’ స్ట్రీమింగ్ చార్ట్స్‌ను షేక్ చేస్తోంది. మంచి కంటెంట్‌కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







