కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- May 11, 2026
కువైట్: మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన ఒక భారతీయ వ్యక్తిని ఇంటర్‌పోల్ సహకారంతో యూఏఈ అప్పగించినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కువైట్, యూఏఈ మధ్య ద్రతా సహకారంలో భాగంగా ఈ అప్పగింత జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అప్పగింత ఇంటర్‌పోల్ అబుదాబి ద్వారా జరిగిందని, దుబాయ్‌లోని క్రిమినల్ సెక్యూరిటీ బ్యూరో దీనిని పర్యవేక్షించిందని పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షతో కూడిన 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. శిక్ష అనుభవించిన తర్వాత అతడిని దేశం నుండి బహిష్కరించాలని, అలాగే నేర కార్యకలాపాల ద్వారా పొందిన నిధులు, ప్రయోజనాలన్నింటినీ జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించిందని మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది.
కువైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ దేశంలో మద్యం అక్రమ అమ్మకాలు, వ్యాపారంలో పాలుపంచుకుంటున్న ముఠాను దర్యాప్తులో గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ ముఠా 13 లైసెన్స్ పొందిన స్థానిక ఎక్స్ఛేంజ్ కంపెనీల ద్వారా 254 అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసినట్లు, ఇందుకు 157 మంది ఆసియా జాతీయుల అకౌంట్లను ఉపయోగించుకుందని, వీటి మొత్తం విలువ KD 433,745.875 అని దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక సంస్థలను బురిడీ కొట్టించి, కుటుంబ ఖర్చులు అనే ముసుగులో విదేశాలకు పంపినట్లు గుర్తించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







