ఈద్ హబ్తా మార్కెట్ కోసం కొత్త నిబంధనలు జారీ..!!
- May 11, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ లో రాబోయే ఈద్ పండుగ నేపథ్యంలో 'హబ్తా'గా పిలువబడే సాంప్రదాయ మార్కెట్లను నియంత్రించే నిబంధనలను మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. వాణిజ్య కార్యకలాపాలతోపాటు ప్రజల భద్రతను నిర్ధారించడానికి వీటిని రూపొందించిటనట్టు పేర్కొంది.
విక్రేతలందరూ తప్పనిసరిగా 3 x 3 మీటర్ల ప్రామాణిక బ్లూ అంబ్రెల్లాను ఉపయోగించాలని మున్సిపాలిటీ ఆదేశించింది. ఈ నిబంధన "గ్రౌండ్ సెల్లింగ్"ను నిషేధించింది. అన్ని సరుకులను ఈ నిర్దేశిత నిర్మాణాల కిందనే పెట్టాలని తెలిపింది. మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి కనీసం ఐదు రోజుల ముందే విక్రేతలు తమ స్టాల్స్‌ను పూర్తిగా సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అమ్మకాలలో పాల్గొనే ప్రవాస కార్మికులు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉన్న లేబర్ కార్డును కలిగి ఉండాలని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. ట్రాఫిక్ ప్రవాహాన్ని మరియు పాదచారుల భద్రతను నిర్వహించే ప్రయత్నంలో హబ్తా జరిగే ప్రదేశాలలోకి స్ట్రీట్ వెండర్స్ బండ్లను నిషేధించారు. ఈ కార్యక్రమంలో ఏవైనా వస్తువులు లేదా పరికరాలు పోయినా లేదా పాడైనా, దానికి తాము బాధ్యత వహించబోమని మున్సిపాలిటీ పేర్కొంది.
ఈద్‌కు ముందు కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే పశువుల వ్యాపారంపై కూడా ప్రత్యేక నియంత్రణలు విధించారు. పశువుల యజమానులు తమకు కేటాయించిన జోన్‌లలోనే కచ్చితంగా కార్యకలాపాలు నిర్వహించాలి. బహిరంగ రహదారులపై లేదా అధికారిక సరిహద్దుల వెలుపల జంతువులను ప్రదర్శించడాన్ని నిషేధించారు.
"హబ్తా" అనేది శతాబ్దాల నాటి ఒమానీ సంప్రదాయం. ఇది సాధారణంగా ఈద్ సెలవులకు ముందు చివరి రోజులలో జరుగుతుంది. ఈ బహిరంగ మార్కెట్లలో పౌరులు మరియు నివాసితులు బలిచ్చే జంతువులు, సుగంధ ద్రవ్యాల నుండి సాంప్రదాయ ఒమానీ కత్తులు (ఖంజార్లు) మరియు పిల్లల బొమ్మల వరకు అన్నింటినీ కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







