అబుదాబి అత్యవసర వాహనాలపై స్మార్ట్ కెమెరాలు..!!
- May 11, 2026
యూఏఈ: రహదారి భద్రతను మెరుగుపరచడానికి అబుదాబిలో అత్యవసర వాహనాలపై స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దారి ఇవ్వని వాహనదారులను గుర్తించనున్నారు.
అగ్నిమాపక, అంబులెన్స్ మరియు రెస్క్యూ వాహనాలలో ఇప్పుడు కెమెరాలను అమర్చినట్లు అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ తెలిపింది. ఇవి కంట్రోల్ రూమ్‌లకు ట్రాఫిక్ పరిస్థితులను రియల్ టైమ్ లో పర్యవేక్షించడానికి, రహదారిపై అత్యవసర సిబ్బందికి అడ్డంకులు సృష్టించే డ్రైవర్లను గుర్తించేందుకు వీలు కల్పిస్తాయని పేర్కొన్నారు.
3,000 దిర్హమ్‌ల జరిమానా
యూఏఈ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వాహనదారులను గుర్తించేందుకు కెమెరాలలో రికార్డ్ అయిన ఫుటేజ్‌ను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వాహనాలకు 3,000 దిర్హమ్‌ల జరిమానా, 30 రోజుల పాటు వాహనం సీజ్ , ఆరు బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు.
ట్రాఫిక్ సిగ్నల్‌ను పూర్తిగా దాటకుండా, రెడ్ లైట్ల వద్ద కూడా డ్రైవర్లు అత్యవసర వాహనాలకు పక్కకు తప్పుకొని దారి ఇవ్వవచ్చని సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు, సహాయక వాహనాలకు వాహనదారులు దారి ఇచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో అబుదాబి పోలీసులు, అబుదాబి ఆరోగ్య శాఖ, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్‌ల భాగస్వామ్యంతో ప్రారంభించిన “సంకోచించవద్దు... వెంటనే దారి ఇవ్వండి” అనే రహదారి భద్రతా ప్రచారంలో ఈ చర్యలు భాగమన్నారు. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ప్రతి సెకను కూడా కీలకమని ఈ ప్రచారం సందర్భంగా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







