పారిశ్రామిక సంబంధాల బలోపేతంపై సౌదీ, జోర్డాన్ చర్చలు..!!
- May 11, 2026
రియాద్: పారిశ్రామిక సంబంధాల బలోపేతంపై సౌదీ అరేబియా, జోర్డాన్ చర్చలు జరిపాయి. సౌదీ పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి బందర్ అల్ఖోరాయెఫ్.. జోర్డాన్ పరిశ్రమలు, వాణిజ్యం మరియు సరఫరాల శాఖ మంత్రి యారుబ్ అల్ఖుదాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ప్రాధాన్యతా పరిశ్రమలలో ఉమ్మడి పెట్టుబడులను విస్తరించడానికి ఉన్న అవకాశాలపై వారు చర్చించారు.
ఈ సమావేశం రెండు దేశాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడానికి మరియు పారిశ్రామిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఒక ముఖ్యమైన పునాదిగా నిలిచింది. ముఖ్యంగా మాన్యుఫ్యాక్షరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆహార పరిశ్రమలు, ఆటోమోటివ్ విడిభాగాలు మరియు లాజిస్టిక్స్ సేవలతో సహా ప్రాధాన్యతా పారిశ్రామిక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలను ఇరుపక్షాలు సమీక్షించాయి. అలాగే, రెండు దేశాలలో ఎగుమతి అవకాశాలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా వారు చర్చించారని ఒక ప్రకటనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!
- దుబాయ్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ విస్తరణకు భారీ ముందడుగు..!!
- ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
- యూఏఈలో గత 20 ఏళ్లలో జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ ఇవే..!!
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!







