దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!

- May 12, 2026 , by Maagulf
దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!

యూఏఈః దుబాయ్ తన AI-ఆధారిత “రెడ్ కార్పెట్” స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ సేవను విస్తరిస్తోంది. ఈ సేవ ద్వారా అర్హులైన ప్రయాణికులు ఎలాంటి ప్రయాణ పత్రాలు చూపించకుండానే కేవలం సెకన్లలో ఇమ్మిగ్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారిన్ అఫైర్స్ – దుబాయ్ (GDRFA దుబాయ్) ప్రారంభించిన ఈ వ్యవస్థ.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3లోని నిర్దేశిత స్మార్ట్ కారిడార్ల గుండా ప్రయాణికులు నడుస్తున్నప్పుడు వారిని గుర్తించడానికి బయోమెట్రిక్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తుంది.
సాంప్రదాయ విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ విధానాలకు భిన్నంగా, రెడ్ కార్పెట్ సేవను ఉపయోగించే ప్రయాణికులు కౌంటర్ల వద్ద ఆగడం, పాస్‌పోర్ట్‌లు చూపించడం లేదా బోర్డింగ్ పాస్‌లను స్కాన్ చేయడం వంటివి అవసరం లేదు. దానికి బదులుగా, ప్రయాణికులు కారిడార్ గుండా నడుస్తూనే అధునాతన కెమెరాలు మరియు బయోమెట్రిక్ వ్యవస్థలు వారి గుర్తింపులను ఆటోమెటిక్ గా ధృవీకరిస్తాయి. ఈ వ్యవస్థ ఒకేసారి 10 మంది ప్రయాణికుల వరకు ప్రాసెస్ చేయగలదు. విమానాశ్రయం దాటే సమయాన్ని 60 శాతానికి పైగా తగ్గిస్తుందని.. అర్హులైన ప్రయాణికులు కేవలం 3.4 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయగలరని అధికారులు తెలిపారు.
ఈ సేవ ప్రస్తుతం టెర్మినల్ 3ని ఉపయోగించే ఎంపిక చేసిన ప్రయాణికులకు అందుబాటులో ఉందన్నారు. గతేడాది యూఏఈ జాతీయులు, నివాసితుల కోసం అరైవల్ హాల్స్‌కు విస్తరించింది. ఈ సేవ ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులు రెడ్ కార్పెట్ సేవను ఉపయోగించుకున్నారని జిడిఆర్‌ఎఫ్‌ఏ దుబాయ్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి అన్నారు.
రెడ్ కార్పెట్ ప్రాజెక్ట్ ప్రభుత్వ సేవలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రయాణ సాంకేతికతలో ఆవిష్కరణలకు అవార్డులను గెలుచుకుని, అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందిందని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com