సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- May 12, 2026
కువైట్ః ప్రయాణికుల హక్కులను పరిరక్షించడానికి , విమాన రవాణాకు సంబంధించిన ఫిర్యాదులను సాహెల్ అప్లికేషన్ ద్వారా సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రయాణికులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తన అధికారిక X ఖాతాలో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది.
ఫ్టైట్స్ డిలే కావడం, లగేజీ సమస్యలు, ఫ్లైట్స్ రద్దు, బుకింగ్ క్యాన్సిల్, ఫ్లైట్ షెడ్యూల్ లేదా బుకింగ్ క్లాస్‌లో మార్పులు, ప్రయాణికులను విమానం ఎక్కడానికి నిరాకరించడం, ఆర్థిక క్లెయిమ్‌లు, ప్యాకేజ్ టూర్లు మరియు డమ్మీ బుకింగ్‌లతో సహా అనేక రకాల విమానయాన మరియు ప్రయాణ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని డీజీసీఏ తెలిపింది.
అలాగే, విమాన మార్గంలో మార్పులు, టేకాఫ్ తర్వాత విమానం తిరిగి రావడం, విమానంలో గాయాలు లేదా మరణాలు వంటి సంఘటనలను కూడా ప్రయాణికులు నివేదించవచ్చని ఆ సంస్థ తెలిపింది. డిజిటల్ ప్రభుత్వ వేదికల ద్వారా ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి, ప్రయాణికులు మరియు విమానయాన అధికారుల మధ్య సమాచారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో ఇది కూడా భాగమని డీజీసీఏ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!









