ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- May 12, 2026
ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా, మరో లారీ బొగ్గు లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో లారీ డ్రైవర్లు ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లకు స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు వరంగల్–ఖమ్మం రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్‌లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!









