జాకీచాన్ చిత్రం తమిళంలో
- August 07, 2016
జాకీచాన్ హీరోగా విడుదలైన 'స్కిప్ ట్రాస్' చిత్రం చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆ ఒక్క దేశంలో మాత్రమే ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు రూ.420 కోట్లు వచ్చాయని, వారంలో రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 2వ తేదీన అమెరికాలో విడుదల కానుందని తెలిపాయి. పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో 'ఇరు కిల్లాడిగళ్' పేరిట అనువదించి తీసుకురానున్నట్లు వెల్లడించాయి. సన్‌మూన్ పిక్చర్స్ సంస్థ ఆధ్వర్యంలో విశ్వాస్ సుందర్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 300 థియేటర్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'కబాలి'లో ప్రతినాయకుడిగా నటించిన తైవాన్ వాసి విన్‌స్టన్ చావో... ఈ చిత్రంలోనూ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









