'2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభo...

- August 07, 2016 , by Maagulf
'2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభo...

 శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం '2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభమయింది. 'రోబో' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దాని సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్‌ సరసన ఎమిజాక్సన్‌ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కనిపించనున్నారు. దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నట్లు, అందులో అక్షయ్‌కుమార్‌ కనిపించేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మరోవైపు ప్రతినాయకుడిగా అక్షయ్‌కుమార్‌ రూపం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. 'కబాలి' చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణలో రజనీకాంత్‌ పాల్గొనలేదు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలను మినహాయించి ఇతర నటీనటులపై మాత్రం చిత్రీకరించారు. యాభై శాతం షూటింగ్‌ పూర్తయినట్లు దర్శకుడు శంకర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ అమెరికాలో విశ్రాంతి తీసుకుని గత వారం చెన్నై వచ్చారు. మళ్లీ '2.ఓ' చిత్రీకరణ మొదలుపెట్టారు. ఆదివారం ఉదయం చెన్నైలోని అయనావరంలో చిత్రీకరణ కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరుకు ప్రజలు వినతులు సమర్పించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులోనూ రజనీకాంత్‌ పాల్గొనలేదు. ఆ ప్రాంతానికి రజనీ అభిమానులు, స్థానికులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అయనావరం పోర్చీస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com