గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!

- May 13, 2026 , by Maagulf
గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!

మానామా: బహ్రెయిన్ జాతీయ విమానయాన సంస్థ అయిన గల్ఫ్ ఎయిర్..  తన తొలి స్టార్‌లింక్ ఆధారిత విమానం కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని ద్వారా తన ప్రయాణికులకు తొలిసారిగా అత్యంత వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.

స్పేస్‌ఎక్స్ రూపొందించి, నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అత్యంత అధునాతన శాటిలైట్ ఇంటర్నెట్ సేవ అయిన స్టార్‌లింక్‌ను అందించే, ఈ ప్రాంతంలోని అగ్రగామి విమానయాన సంస్థలలో గల్ఫ్ ఎయిర్ ఒకటిగా నిలిచిందని గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ గాస్ తెలిపారు.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గల్ఫ్ ఎయిర్ అవల్ ప్రైవేట్ టెర్మినల్‌లో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు, విమానయాన అధికారులు మరియు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మీదుగా స్టార్‌లింక్ సదుపాయంతో కూడిన ఒక ప్రత్యేక విమాన ప్రయాణాన్ని నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com