బాలయ్య సినిమాలో ‘హనీ రోజ్’ రీఎంట్రీ
- May 13, 2026
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ (NBK 111) సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మీనాక్షి’ పాత్ర, ‘సుగుణ సుందరి’ సాంగ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సందడి చేశాయో అందరికీ తెలిసిందే. బాలయ్య సరసన హనీ రోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్గా ఉండటంతో, మరోసారి ఆ సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీని వెండితెరపై ఆవిష్కరించేందుకు గోపీచంద్ మలినేని సిద్ధమయ్యారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ మాఫియా డాన్‌గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. హనీ రోజ్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 2026 ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతం కాగా, గోపీచంద్ తన మార్కు మాస్ ఎలిమెంట్స్‌తో బాలయ్యను వెండితెరపై పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. బాలయ్య-గోపీచంద్ కాంబో అంటేనే మాస్ ఎలివేషన్లకు పెట్టింది పేరు. దీనికి తోడు హనీ రోజ్ తోడవడంతో థియేటర్లలో మరోసారి పూనకాలు గ్యారెంటీ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాలో బాలయ్య లుక్, డైలాగ్స్ సరికొత్తగా ఉంటాయని చిత్ర బృందం హింట్ ఇస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







