ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!

- May 14, 2026 , by Maagulf
ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!

రియాద్: సౌదీ ఉద్యోగులు ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం విధించారు. సౌదీ అరేబియా మానవ వనరుల మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ' ఖివా ' (Qiwa) ప్లాట్‌ఫారమ్.. సౌదీ ఉద్యోగులు ఒక సంవత్సర కాలంలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటాన్ని నిషేధించింది.  మొదటి ఉద్యోగ ఒప్పందం కుదిరిన తేదీ నుండి లెక్కించిన 365 రోజుల వ్యవధిలో ఉద్యోగి అప్పటికే ఏడు ఉద్యోగ ఒప్పందాలను పూర్తి చేసి ఉంటే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.

సౌదీయేతర ఉద్యోగుల పని అనుమతులు (work permits) గడువు ముగిసినట్లయితే, లేదా జూన్ 30తర్వాత మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు వారు పని అనుమతి లేకుండా కొనసాగినట్లయితే వారి రెసిడెన్సీ హోదా (residency status)తో సంబంధం లేకుండా వారి నమోదును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే, ఒక ఉద్యోగి ఏకకాలంలో రెండు ఉద్యోగాలను కలిగి ఉండటానికి అనుమతి ఉందని ఈ ప్లాట్‌ఫారమ్ తెలిపింది.  

' నితాఖత్ ' (Nitaqat) కార్యక్రమం కింద ఒక సంస్థ సౌదీ ఉద్యోగి ద్వారా ప్రయోజనం పొందాలంటే, ఆ ఉద్యోగి హిజ్రీ క్యాలెండర్ ప్రకారం కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని తెలిపింది. కనీసం SR 4,000 ప్రాథమిక జీతం పొందాలని  ఈ ప్లాట్‌ఫారమ్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com