విభజన సమస్యలపైనా గవర్నర్‌తో చంద్రబాబు చర్చించారు

- August 08, 2016 , by Maagulf
విభజన సమస్యలపైనా గవర్నర్‌తో చంద్రబాబు చర్చించారు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో కలిశారు. ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలని ఆయన గవర్నర్‌ను కోరారు. అలాగే, విభజన సమస్యలపైనా గవర్నర్‌తో చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది.
రాష్ట్రపతిని కలవనున్న జగన్వైసిపి అధినేత వైయసల్ జగన్ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం కూడా అక్కడే పర్యటిస్తారు. వైసిపి ఎంపీలతో సహా వెళ్లి సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు.ఢిల్లీలో అందుబాటులో ఉండే ఇతర జాతీయ పార్టీల నేతలను మంగళవారం కలుస్తారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, ఇతర జాతీయ నేతలను కలిసి ఏపీ సమస్యను ప్రస్తావిస్తామని జగన్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com