అమెరికా, ఆస్ట్రేలియా విద్యావేత్తలను ఉగ్రవాదులు కిడ్నాప్
- August 08, 2016
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో అమెరికా, ఆస్ట్రేలియా విద్యావేత్తలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ వార్తలు స్థానిక మీడియాలో వెలువడ్డాయి. అఫ్ఘనిస్థాన్ పోలీసు అధికారులు అధికారికంగా ఈ విషయంపై స్పందించారు. ఇద్దరు విదేశీలు కిడ్నాప్ అయ్యారని అన్నారు.
అమెరికా యూనివర్శిటీ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ లో ఆస్ట్రేలియా విద్యావేత్త, అమెరికా ప్రొఫెసర్ పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి కొందరు సాయుధులు వీరిద్దరిని కిడ్నాప్ చేశారు. జాతీయ భద్రతాధికారులు (నేషనల్ సెక్యూరిటీ ఆఫిసర్లు) ధరించే దుస్తులు వేసుకుని వచ్చి ఇద్దరిని కిడ్నాప్ చేశారు.తమ దేశస్థుడు కిడ్నాప్ కు గురైనాడా ? అనే వార్తల్లో నిజానిజాలు తెలుసుకోవాలని ఆఫ్ఘనిస్థాన్ లోని రాయబార కార్యాలయాన్ని ఆదేశించామని ఆస్ట్రేలియా విదేశాంగ కార్యాలయ వర్గాలు తెలిపాయి.కొందరు సాయుధులు అమెరికా ప్రొఫెసర్ ను కిడ్నాప్ చేశారని మాకు తెలిసిందని అమెరికా అధికారులు వెల్లడించారు. కిడ్నాప్ జరిగిన విషయం కాబూల్ పోలీస్ చీఫ్ అబ్దుల్ రెహమాన్ రహీమి దృవీకరించారని అమెరికా అధికారులు చెబుతున్నారు.మరన్ని వివరాలు చెప్పడానికి కాబుల్ అధికారులు నిరాకరించారు. ఆఫ్ఘనిస్థాన్ లో నిత్యం ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అవసరమైతే తప్ప అక్కడ సంచరించరాదని ప్రశ్చాత్య దేశాలు తమ దేశ ప్రజలను హెచ్చరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







