హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!

- May 18, 2026 , by Maagulf
హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!

రియాద్ః హజ్ వీసా గడువు దాటితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా హెచ్చరించింది. వీసా గడువు దాటిన విదేశీయులు (ప్రవాసులు) గరిష్టంగా SR50,000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

యాత్రికులు హజ్ సీజన్ నిబంధనలను పాటించాలని మరియు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘన గురించిన సమాచారం తెలిస్తే.. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రాంతాలలో 911 నంబర్‌కు, అలాగే  మిగతా ప్రాంతాలలో 999 నంబర్‌కు డయల్ చేసి తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com