తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- June 09, 2026
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన పి.వి.నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డా.ఎన్.వి.సుధా కిరణ్ మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ లోని లోక్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో ట్రస్ట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా మరియు ప్రజా సేవా రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాల పై గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించి, సమాజ అభ్యున్నతికి ఇలాంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ సమావేశంలో ట్రస్ట్‌కు చెందిన ఇతర సభ్యులు, ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







