వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- June 09, 2026
దోహా: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఖతార్‌లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖతార్ వైఎస్సార్సీపీ కన్వీనర్ షేక్ జాఫర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షేక్ జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, ఉద్యోగాల కల్పన, రైతు సంక్షేమం వంటి అంశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
అలాగే డీఎస్సీ నియామకాలు, క్రీడా కోటా అంశాల్లో యువతను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వం వైఫల్యాల బాటలో నడుస్తోందని, ప్రజల సమస్యలను విస్మరించి పాలన సాగిస్తోందని అన్నారు.
జీసీసీ కో-కన్వీనర్ దొండపాటి శశికిరణ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బాబు శీకొలు, సురేష్ వాసర్ల, సూర్య రాపాక, షాన్ షేక్, మనీష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహ రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, దినేష్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, షోయబ్, జాహిద్ హుస్సేన్, భాను ప్రకాష్, అలీం, రాజ్ కుమార్, పితాని శ్రీను తదితరులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







