కర్ణాటక దుబారే క్యాంప్‌లో విషాదం..
- May 18, 2026
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన దుబారే ఎలిఫెంట్ క్యాంపు లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉల్లాసంగా గడపడానికి వచ్చిన పర్యాటకుల కళ్ల ముందే ఒక భయానక ప్రమాదం జరిగి, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కొడగు జిల్లాలోని ఏనుగుల శిబిరంలో రెండు ఏనుగులు పరస్పరం గొడవ పడుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
దుబారే శిబిరంలోని ఏనుగులకు మావటీలు కొలనులో స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నారు. అయితే, అకస్మాత్తుగా రెండు ఏనుగుల మధ్య తేడా రావడంతో అవి ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ తీవ్రంగా ఘర్షణకు దిగాయి. భారీ కాయాలు కలిగిన ఆ రెండు ఏనుగులు గొడవ పడటం చూసి అక్కడున్న పర్యాటకులు భయాందోళనతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు.
పర్యాటకురాలి పై పడిపోయిన ఏనుగు
ఈ ఘర్షణలో ఒక ఏనుగు అదుపుతప్పి ఒక్కసారిగా పర్యాటకులు పరిగెడుతున్న వైపు దూసుకొచ్చింది. క్యాంప్ సందర్శనకు వచ్చిన ఒక మహిళా పర్యాటకురాలిపై ఆ ఏనుగు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి పర్యాటకులు, జైలు సిబ్బంది వెంటనే ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







