మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- May 18, 2026
విజయవాడ: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద చేపట్టిన ‘యువ సంగం’లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం లోక్ భవన్‌లోని దర్బార్ హాల్లో మహారాష్ట్ర విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న మహారాష్ట్రలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ ను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఆధునిక సరిహద్దులు ఏర్పడక ముందే ఇరు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించిన ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాల రూపంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు శతాబ్దాల చరిత్ర ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ భారత కీర్తి కిరీటంలో ఒక అమూల్యమైన రత్నమని, దేశ మత్స్య సంపద ఉత్పత్తుల ఎగుమతుల్లో 40% వాటాతో అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటిగా ఉందని గవర్నర్ అన్నారు. రాష్ట్రం 'ఈజ్-ఆఫ్-డూయింగ్-బిజినెస్' నుండి 'స్పీడ్-ఆఫ్-డూయింగ్-బిజినెస్' దశకు పురోగమించిందని, దేశంలోని అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచి, భారతదేశపు మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలలో 25% పైగా వాటాను దక్కించుకుని, 2026 నాటికి అగ్రశ్రేణి పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆవిర్భవించిందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రాజధాని అయిన అమరావతి, ఆవిష్కరణ, సుస్థిరత మరియు ప్రపంచ స్థాయి పట్టణ రూపకల్పన ఆధారంగా నిర్మించబడుతోందని, మరియు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన క్వాంటం టెక్నాలజీ పార్క్ మరియు ఇన్నోవేషన్ హబ్ అయిన అమరావతి క్వాంటం వ్యాలీ ఒక మార్గదర్శక సదుపాయమని, ఇందులో క్వాంటం క్లౌడ్ యాక్సెస్ మరియు పరిశోధన కోసం IBM టెక్నాలజీతో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్-యాక్సెస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ (QRF) మరియు TCS వంటి ప్రధాన టెక్ సంస్థలతో భాగస్వామ్యాలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 19 కేంద్రీయ స్వయంప్రతిపత్తి సంస్థలు, 28 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 7 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మరియు 13 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఇది దేశంలోనే అగ్రగామి విద్యా మరియు ఆవిష్కరణల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ ఉన్నత విద్యాసంస్థలలో ఎయిమ్స్ మంగళగిరి, తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఈఆర్, విశాఖపట్నంలోని ఐఐఎం మరియు ఐఐపిఈ, ఐఐఐటి శ్రీ సిటీ, విజయవాడలోని ఎన్ఐడి, ఎస్పిఏ, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, వంటి అగ్రశ్రేణి జాతీయ సంస్థలు ఉన్నాయని గవర్నర్ చెప్పారు. స్వర్ణ ఆంధ్ర@2047 దార్శనికత భారత ప్రభుత్వ 'విశిష్ట భారత్' కార్యక్రమానికి అనుగుణంగా ఉందని, ఇది మౌలిక సదుపాయాల నిర్మాణం, పారిశ్రామిక వృద్ధి మరియు సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులతో ముచ్చటించి, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఐఐఎస్ఈఆర్ మరియు తిరుపతికి చెందిన ఐఐటి సమన్వయం చేశాయి.ఈ కార్యక్రమానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము, సంయుక్త కార్యదర్శి పి.ఎస్.సూర్య ప్రకాష్, లోక్ భవన్ అధికారులు మరియు సిబ్బంది హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







