‘గోదారి గట్టుపైన' నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది: హీరో సుమంత్ ప్రభాస్
- May 18, 2026
‘గోదారి గట్టుపైన' నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది. ఫ్యామిలీలతో థియేటర్లు కలకలలాడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది: థాంక్ యూ మీట్ లో హీరో సుమంత్ ప్రభాస్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా కంటెంట్‌ను ఎంతో స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. మూడేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. ‘ఎవరైనా టికెట్ కొంటారా?’ అని మా ఫ్రెండ్స్ అన్నప్పుడు నా మనసు కాస్త కళుక్ మంది. కానీ మేము థియేటర్లు విజిట్ చేస్తూ పల్లెటూర్లలో తిరిగినప్పుడు థియేటర్లలో కనిపించిన ఎనర్జీ మామూలుగా లేదు. ఫ్యామిలీలతో థియేటర్లు కలకలలాడడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ‘మేం ఫేమస్’ సినిమాను యూత్ కనెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్‌ను పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ చంద్ర గారికి థ్యాంక్స్. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 12వ రోజు కూడా హౌస్‌ఫుల్ రన్ తీసుకుందంటే అది నిర్మాత అభినవ్ గారి వల్లే సాధ్యమైంది. ప్రతి యంగ్ ఫిల్మ్‌మేకర్‌కు అభినవ్ గారి లాంటి నిర్మాత దొరకాలి. మాకు ఎంతో స్ఫూర్తినిస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. సినిమాకు వచ్చిన ఫలితంతో చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకోసం కష్టపడ్డ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్యూ. మా నటీనటులకు, టెక్నీషియన్స్‌కి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. చూడని వాళ్లు తప్పకుండా వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మాయ క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సుమంత్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. టీమ్ అందరికీ ధన్యవాదాలు. మా సినిమాకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు మరొకసారి కృతజ్ఞతలు.
నిర్మాత అభినవ్ రావు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మౌత్ టాక్‌తోనే ఇలాంటి సినిమాలు నిలబడతాయి. ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌తో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా సినిమా చూడని వారు మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడండి. చాలా బాగుంటుంది. సుభాష్, సుమంత్‌లకు థ్యాంక్స్. థియేటర్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ వీక్ నుంచి సినిమా మరింత పెరిగింది. ఇంకా చూడని వారు తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సచిన్ టెండూల్కర్ గారు ఒక మంచి మాట అన్నారు… ‘ఎవరైనా రాళ్లు విసిరితే, ఆ రాళ్లతోనే మైయిలురాయి చేసుకోండి ’ అని. ‘గోదారి గట్టుపైన’ మాకు అలాంటి మైలు రాయి. 10 రోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయం. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. ఇది పూర్తిగా ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది. మనుషులందరూ మంచివాళ్లే. కానీ పరిస్థితుల వల్ల వారి ప్రవర్తన మారుతుంది. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. సినిమా అనేది పవర్‌ఫుల్ మీడియం. దాని ద్వారా మంచి చెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకు మా ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా సహకరించారు. ఇందులో కనిపించే పాత్రలు మన సమాజంలో చూసినట్లుగానే ఉంటాయి. అందుకే ప్రేక్షకులు బాగా రిలేట్ అవుతున్నారు. ఈ విజయం ప్రజలది. జనం ఈ సినిమాను నిలబెట్టారు. థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన కుటుంబాలు మాకు నిజమైన పండగలా అనిపించాయి. ఫస్ట్ డే వచ్చిన మిక్స్‌డ్ రివ్యూస్ సమయంలో నిర్మాత గారు మాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. ‘మనం మంచి సినిమా తీశాం… మంచి జరుగుతుంది’ అని నమ్మకం కల్పించారు. ఆ నమ్మకం నిజం అయ్యింది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతలు లాభాల దిశగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమా చేశారు. సుమంత్ ప్రభాస్, నిధి అందరూ అద్భుతంగా నటించారు. జగపతిబాబు లైలా గారు కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేశారు. వేసవిలో ఇంత మంచి సినిమాను విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు.
రేణు మాట్లాడుతూ..మా సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా పాత్రకు కూడా ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.
రాజ్‌కుమార్ కసిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమాను అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. సినిమాకు చాలా మంచి విజయాన్ని ఇచ్చారు. మా టీమ్ అందరికీ, ప్రేక్షకులకు థ్యాంక్యూ సో మచ్”
సుదర్శన్ మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో చిన్న సినిమా సూపర్ హిట్ అవ్వడం, నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఈ సినిమాకు ఫ్యామిలీలు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. నిన్న కూడా చాలా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇలాంటి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రోజు రోజుకూ పెరుగుతూ రావడం, ఇంత ఘనవిజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్‌ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్‌లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









