తగ్గిన పసిడి, వెండి ధరలు

- August 08, 2016 , by Maagulf
తగ్గిన పసిడి, వెండి ధరలు

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు కాస్త దిగొస్తున్నాయి. బులియన్‌ మార్కెట్లో సోమవారం బంగారం ధర రూ. 30 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,900గా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధర తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పడిపోయింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం 1,331.59 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. జులై 29 నుంచి సింగపూర్‌లో ఇదే కనిష్ఠ ధర. వెండి ధర కూడా నేడు రూ. 50 తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,250గా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com