ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంపూ

- August 08, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంపూ

విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపూర్ణేష్‌బాబు. తొలి చిత్రం 'హృదయకాలేయం'తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం 'కొబ్బరిమట్ట' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న సంపూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంపూర్ణేష్‌బాబును ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంపూ.. ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. 'కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం వారికి నా నమస్సులు' అంటూ ట్వీట్‌ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com