ఒక మహిళను 66 కత్తిపోట్లు పొడిచిన వాచ్మెన్

- August 08, 2016 , by Maagulf
ఒక మహిళను 66 కత్తిపోట్లు పొడిచిన వాచ్మెన్

దుబాయ్ : ఒక ఫిలిప్పైన్స్ మహిళని  66 సార్లు కత్తిపోట్లు పొడిచి తన కక్ష తీర్చుకొన్నాడా పాకిస్థానీయుడైన  వాచ్మెన్, చిన్న వివాదానికి ఆమెని హతమార్చే యత్నం చేసిన కాపలాదారుని కర్కశ మనస్తత్వం పలువురికి ఆశ్చర్యం కల్గిస్తుంది. ఆరునెలల క్రితం జరిగిన ఈ ఘటన సంబంధించి ప్రస్తుతం కోర్టులలో వాజ్యం జరుగుతుంది. ఆనాడు  ఆ వ్యక్తి ఉపయోగించే ఒక నీటి బకెట్ ని  ఆమె కాలితో తన్ని అవమానించదనే చిన్న విషయానికి నిలువెల్లా రగిలిపోయి ఈ దుశ్చర్యకు పాల్పడ్డా దుర్మార్గుడు. ఆమెని  పొత్తి కడుపు, ఛాతి, మెడపై 66 కత్తిపోట్లు పొడిచాడు.
ఆమెని  చంపిన తరువాత, ఆ  24 ఏళ్ల పాకిస్తానీ వాచ్మెన్ స్టూడియో ఫ్లాట్ నుంచి తన గదికి వెళ్లి  బట్టలు మార్చుకొని తిరిగి వేరే దుస్తులతో అక్కడకు వచ్చి  అంబులెన్స్ మరియు పోలీసులు వచ్చినపుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా నుంచొన్నాడని ప్రాసిక్యూషన్ కధనం. కాగా, చనిపోయిన ఫిలిప్పైన్స్ మహిళ తన ప్రియుడుతో కలిసి అంతర్జాతీయ నగరంలో గత కొంతకాలంగా ఉండేది. నిందితుడిపై  హత్య మరియు దొంగతనం కేసు నమోదయింది. ఈ సందర్భంగా పాకిస్తానీ వాచ్మెన్ ఆమెని  చంపడానికి ఉద్దేశ్యం కాదని ...బెదిరించుదామని వెళ్లినట్లు  పేర్కొన్నాడు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం  ఆ  మహిళ శరీరం పై  66 కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇవి కావాలని  పొడిచినట్లుగా ఉందని  గాయాలని పరిశీలనలో తేలింది. కత్తితో పొడవడం ద్వారా ఫిలిప్పైన్స్ మహిళకు  గుండె  ఆమె కుడి ఊపిరితిత్తి, కాలేయ భాగాలు  దెబ్బతిన్నట్లు తెలిపారు. పోలీసులు ప్రశ్నించే సమయంలో కాపలాదారు ఈ సంఘటనను ఫిబ్రవరి 18 న  ఉదయం  9:30 సమయంలో ఇంగ్లీష్ క్లస్టర్ ఫ్లాట్ సమీపంలో కారిడార్ శుభ్రం చేసే సమయంలో తమ మధ్య గొడవ జరిగినట్లు  పేర్కొన్నాడు. ఆ తర్వాత  పోలీసులు  రెండు రోజుల తరువాత కాపలాదారుడ్ని అరెస్టు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com