గురుదేవ్ నవలను సినిమా చేయాలని నిర్మాత రవి కుమార్ పనసకు సూచన
- May 22, 2026
‘భగవంతుడు’ చిత్రానికి శ్రీశ్రీ రవిశంకర్ ఆశీస్సులు
బెంగళూరు: ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనసా సినీ నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. పలు వ్యాపార రంగాల్లో విజయవంతంగా రాణించిన ఆయన, ఇప్పుడు ‘భగవంతుడు’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఆధ్యాత్మిక సమావేశంలో రవి కుమార్ పనసకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ‘భగవంతుడు’ సినిమా టీజర్‌ను గురుదేవ్ వీక్షించి చిత్ర బృందం చేసిన కృషిని అభినందించినట్లు సమాచారం.
సమావేశం అనంతరం రవి కుమార్ పనస సోషల్ మీడియాలో స్పందిస్తూ, గురుదేవ్ ఆశీస్సులు పొందడం జీవితంలో మరపురాని అనుభూతిగా పేర్కొన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని శ్రీశ్రీ రవిశంకర్ ఆకాంక్షించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ తన రచనలోని ఒక నవలను రవి కుమార్ పనసాకు బహుమతిగా అందజేసి, అవకాశం ఉంటే దాన్ని సినిమాగా తెరకెక్కించాలని సూచించినట్లు తెలిసింది. ఈ సంఘటన తన సినీ ప్రయాణానికి మరింత ప్రేరణనిచ్చిందని రవి కుమార్ పనస తెలిపారు.
వ్యాపార రంగంలో గుర్తింపు పొందిన రవి కుమార్ పనస, ఇప్పుడు ఆధ్యాత్మిక స్పూర్తితో సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం విశేషంగా మారింది. ‘భగవంతుడు’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







