ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- May 23, 2026
దోహా: ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఖతార్ , జోర్డాన్ చర్చలు జరిపాయి. రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీ.. జోర్డాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రి ఐమాన్ సఫాదీతో ఫోన్‌లో మాట్లాడారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్తాన్ నేతృత్వంలో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో పాటు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపునకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలపై ఇరుపక్షాలు చర్చించాయి. మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా స్పందించాలని, దౌత్య పరమైన వి ద్వారానే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సూచించారు. ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించే ఒక సుస్థిరమైన ఒప్పందం దిశగా కృషి చేయాలని ఖతార్ , జోర్డాన్ పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







