అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు

- May 24, 2026 , by Maagulf
అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు

న్యూ జెర్సీ: మే 23  అమెరికాలో తెలుగు సంస్కృతి గొప్ప తనాన్ని చాటేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్...సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఫోర్డ్స్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి నేతృత్వం లో నిర్వహించిన ఈ  సాంస్కృతిక సంబరాలు తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ స్థానిక ప్రవాస తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సంబరాలకు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 

ఇటీవలే పద్మ పురస్కారాలు వరించిన ప్రముఖ చలనచిత్ర నటుడు డాక్టర్  మాగంటి మురళీమోహన్  అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దత్తాత్రేయుడు నోరిలను నాట్స్ నాయకులు  కిషోర్ కంచర్ల, శ్రీహరి మండాడి, ప్రశాంత్ పిన్నమనేని, మోహన్ కృష్ణ మన్నవ.సామ్ మద్దాలి, అరుణ గంటి, రాజ్ అల్లాడ , బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, శ్రీనివాస్ మెంట, శ్రీనివాస్ భీమినేని, హరినాథ్ బుంగటావుల, కిరణ్ మందడి, మురళి మేడిచర్ల తదితరులు ఈ సంబరాల వేదికపై ఘనంగా సత్కరించారు.

 సమాజానికి, తెలుగు జాతికి మురళీమోహన్, డాక్టర్ నోరి చేసిన అసమాన సేవలను నాట్స్ నాయకులు కొనియాడారు.అమెరికాలో ఉంటున్న తెలుగు వారు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ నటుడు మురళీమోహన్ అన్నారు. మన తెలుగు మూలాలను ఎప్పటికి మరిచిపోకుండా ఉండాలని ఆయన సూచించారు. అలాగే తెలుగువారు జీవితంలో ఎదగడానికి కావాల్సిన వ్యక్తిత్వ వికాసం గురించి మురళీమోహన్ వివరించారు.  

క్యాన్సర్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నోరి దత్తాత్రేయ వివరించారు. కాన్సర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవశ్యకతను నోరి వివరించారు. అలాగే ఎన్టీఆర్ సతీమణి బసవతారకంకు తాను గతంలో చికిత్స చేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.  

ప్రవాసంలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి నాట్స్ నిరంతరం కృషి చేస్తుందని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అన్నారు. భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదాన్ని విధానంగా మార్చుకుని నాట్స్ ముందుకు సాగుతుందని తెలిపారు. అమెరికాలో తెలుగు వారి మేలు కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. అమెరికాలో తన హయాంలో 12 నాట్స్ చాప్టర్లను ప్రారంభించామని తెలిపారు. తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ హెల్ఫ్‌లైన్ ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. గడిచిన రెండేళ్లలో ఇటు అమెరికాలో, అటు ఇండియాలో నాట్స్ తెలుగువారికి మరింత చేరువైందని తెలిపారు.

 నాట్స్ 2.0 ద్వారా నేటి తరానికి..భావితరానికి ఓ వారధి నిర్మించామని... తెలుగు సంస్కృతిని  తరతరాల పాటు నిలబెట్టేలా నాట్స్ కృషి చేస్తుందని నాట్స్ మాజీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. నాట్స్ ఇటీవల కాలంలో క్రమంగా అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్న తీరుని శ్రీహరి కృషిని ఆయన వివరించారు. నాట్స్ విస్తరణకు, నాట్స్‌ను తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి చేసిన కృషిని నాట్స్ పాస్ట్ ప్రెసిడెంట్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మోహన కృష్ణ మన్నవ గుర్తు చేశారు. తెలుగువారికి సేవలు అందించడానికి శ్రీహరి మందాడి ఎప్పుడూ ముందుంటాడని అన్నారు. ఈ వేదిక ద్వారా పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహన్ కృష్ణ మన్నవ. గంగాధర్ దేసు పాస్ట్ చైర్మన్ సామ్ మద్దాలి, పాస్ట్ చైర్ వుమన్ అరుణ గంటి గార్లను శ్రీహరి మరియు నాట్స్ నాయకత్వం ఘనంగా సన్మానించారు. 
 
నాట్స్ సాంస్కృతిక సంబరాల్లో భాగంగా నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకలు, అమ్మల గొప్పతనాన్ని చాటిచెబుతూ అందరి మనసులను కదిలించాయి. మదర్స్ డే సందర్భంగా అమ్మతో అడుగులు కార్యక్రమాన్ని స్వర్ణ గడియారం నృత్య దర్శకత్వం లో 50 మందికి పైగా మదర్, గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్స్ తో చేసిన స్క్రిప్టు హైలైట్ గా నిలిచింది. 
అలాగే 'బాలల సంబరాలు', 'తెలుగు అమ్మాయి' పోటీలలో పిల్లలు తమ ప్రతిభాపాటవాలతో అలరించగా, విజేతలకు ట్రోఫీలను బహుకరించారు. ప్రముఖ యువ గాయనీ గాయకులు హర్షిత యార్లగడ్డ, అద్వైత్ బొందుగుల తమ మధురమైన గళంతో ఆలపించిన పాటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నృత్య మాధవి స్కూల్ ఆఫ్ డాన్స్ డైరెక్టర్ దివ్య ఏలూరి శిష్యురాలు, దివ్యాంజలి డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు-డాన్స్ డైరెక్టర్ శైలజ విశ్వనాథ్ సర్వ చేసిన దుర్గా ఆవిర్భవము అను కూచిపూడి నృత్యం మన నృత్య, సాంస్కృతిక వైభవాన్ని చాటింది.
2025లో నాట్స్ తెలుగమ్మాయి పోటీల విజేతలకు కూడా ఇదే వేదికపై నాట్స్ నాయకులు బహుమతులు ప్రధానం చేశారు. ఆనాడు నాట్స్ తెలుగమ్మాయి పోటీల్లో వయసుల వారీగా ముద్దుగుమ్మ, కిన్నెరసాని, కావ్యనాయకి అనే శీర్షికలతో పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ముద్దుగుమ్మ పోటీల్లో ప్రథమ స్థానంలో విజేతగా నిలిచిన సమిక సుబ్బారావు, రెండో స్థానంలో నిలిచిన దిషిత గండ్లూరి, మూడో స్థానం సంపాదించిన శ్రీ వల్లి కోడూరికి బహుమతులు ప్రధానం చేశారు. అలాగే నాట్స్ కిన్నెరసాని విజేత నిహారిక బవిరిశెట్టి, నాట్స్ కావ్యనాయకి విజేత వాహిని కాళిదాస్‌లకు కూడా బహుమతులు ప్రదానం చేసి నాట్స్ నాయకులు సత్కరించారు.
నాట్స్ సాంస్కృతిక సంబరాలు విజయవంతంగా  నిర్వహించడంపై నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ప్రత్యేక హర్షాన్ని వ్యక్తం చేశారు. విచ్చేసిన అతిథులందరికీ ఉచిత ప్రవేశంతో పాటు ఘనమైన విందు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపింగ్ స్టాళ్లు ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ గాయకులు శరత్ చంద్ర, ఇతర స్థానిక, జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా విచ్చేసి శ్రీహరి కృషి ని ప్రశంసించారు.

ఈ సంబరాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన బిందు యలమంచిలి, కిరణ్ మందాడి లకు శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీనివాస్ మెంటా, శ్రీకాంత్ పొనకల, మురళీకృష్ణ మేడిచెర్లకు నాట్స్ నాయకత్వం అభినందలు తెలిపింది. ఈ కార్యక్రమ నిర్వహణలో విలువైన సేవలను అందించిన నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ టీమ్ సభ్యులు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్, ఈసీ, నాట్స్  ఇతర కమిటీలసభ్యులు, జాతీయ, స్థానిక స్పాన్సర్లకు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దాము గేదెల సన్మానాలకు సమన్వయ సహాయ సహకారాలు అందించారు. శ్రీకాంత్ పొనకాల, స్మిత గాడి వెండార్స్ అండ్ స్పాన్సర్ సెక్షన్స్ పర్యవేక్షించారు. ప్రసాద్ టేకీ, శ్రీదేవి జాగర్లమూడి, జతిన్ కొల్లా, ధర్మ ముమ్ముడి, ప్రణీత పగిడిమర్రి, అపర్ణ కర్ణ , గాయత్రి చిట్టేటి, శంకర్ జెర్రిపోతుల, కేశవి మద్దిరాల, వైశాలి పొనకల, సుధా టేకి, రాకేష్ వేలూరు, సురేంద్ర పోలేపల్లి తదితరులు ఈ సాంస్కృతిక సంబరాలలో తమవంతు సహకారం అందించారు. 1000 మందికి పైగా ఈ సాంస్కృతిక సంబరాలకు విచ్చేశారు. 

ఈ సంస్కృతిక సంబరాలకు పలు రాష్ట్రాలనుంచి అతిథులు, డల్లాస్ నుండి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ విజయ్ కొండ, డెన్వర్ నుండి నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ అనుదీప్ ఆర్ల, ఫ్లోరిడా నుండి ఫండ్రైజింగ్ చైర్ ప్రసాద్ ఆరికట్ల, ఫిలడెల్ఫియా నుండి నాట్స్ వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగటావుల, నాట్స్ జాయింట్ సెక్రటరీ రామ్ కొమ్మనబోయిన, రమణ కుమార్ తదితరులు విచ్చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com