హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- May 26, 2026
రియాద్: బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసెమ్ చేసిన బాధ్యతారహితమైన ప్రకటనలను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి వ్యతిరేకంగా నేరాలు చేసి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో కలిసి గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రుజువైన వ్యక్తులపై బహ్రెయిన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఖాసెమ్ ప్రకటన జారీ చేయడాన్ని తప్పబట్టారు. సదరు వ్యక్తులు బహ్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలు చేపట్టారని, దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నినట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు.
2016లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం.. హిజ్బుల్లాతోపాటు ఆ సంస్థ నాయకులు, అనుబంధ సంస్థలను జిసిసి సభ్య దేశాలు ఒక ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తాయని అల్బుడైవి ధృవీకరించారు. లెబనీస్ రిపబ్లిక్ మరియు దాని ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అన్ని పద్ధతులను జిసిసి నిస్సందేహంగా తిరస్కరిస్తుందని అల్బుడైవి చెప్పారు. లెబనాన్ చట్టబద్ధమైన సంస్థలను బలహీనపరిచే ఏ ప్రయత్నాలైనా ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ నాయకత్వంలో లెబనాన్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలకు, అలాగే ప్రధానమంత్రి నవాఫ్ సలాం నాయకత్వంలో లెబనీస్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన సంస్కరణల కార్యక్రమాలకు జీసీసీ మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







