శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్

- May 27, 2026 , by Maagulf
శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్

కొలంబో: ఈ వర్షాకాలంలో విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్న భారతీయులకు శ్రీలంక ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. మే 25 నుంచి భారతీయులు శ్రీలంకకు ఉచితంగా వెళ్లవచ్చు. భారతీయ పర్యాటకుల కోసం శ్రీలంక అధికారికంగా ఉచిత ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల 30 రోజుల స్టే కోసం గతంలో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజులు ఇకపై ఉండవు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీజు రద్దు నిర్ణయంతో థాయ్‌లాండ్, యూఏఈ (UAE) వంటి దేశాల సరసన ఇప్పుడు శ్రీలంక కూడా చేరింది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం ఈ దేశాలు ఎంట్రీ నిబంధనలను వరుసగా సులభతరం చేస్తున్నాయి.

వీసా ఫీజును తొలగించడంతో, బడ్జెట్ ట్రావెలర్లకు శ్రీలంక ఇప్పుడు బెస్ట్ డెస్టినేషన్‌గా మారింది. దీనివల్ల ఫ్యామిలీ ట్రిప్స్ లేదా షార్ట్ స్టే ప్లాన్ చేసేవారు భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. శ్రీలంక కొత్త ETA నిబంధనలు, ఖర్చుల వివరాలు వీసా అప్లికేషన్ ప్రాసెస్ యథావిధిగా అధికారిక ETA వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ పద్ధతిలోనే ఉంటుంది. వీసా ఉచితమే అయినప్పటికీ, ప్రయాణానికి ముందే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం తప్పనిసరి. అలాగే, మీ పాస్‌పోర్ట్ శ్రీలంకలో అడుగుపెట్టిన నాటి నుండి కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ కలిగి ఉండాలి. పర్యాటకుల రాకపోకలను ట్రాక్ చేస్తూనే, వారికి సులభమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. మీరు శ్రీలంక చేరుకున్నాక, మీ డాక్యుమెంట్లను పరిశీలించి ఇమ్మిగ్రేషన్ అధికారులు 30 రోజుల ఎంట్రీ పర్మిట్ ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com