మనామా సూక్‌లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- May 27, 2026
మనామా: ఈద్ అల్-అధా సందడితో మనామా సూక్‌లో కొనుగోలుదారుల సందడి పెరిగింది. ఇటీవల మార్కెట్‌కు వచ్చే వారి సంఖ్య పెరగడం, కొనుగోలుదారుల ఆసక్తితో మార్కెట్ తిరిగి జీవం పోసుకుందని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు.
సాంప్రదాయకంగా ఈద్ సీజన్ అమ్మకాలకు అత్యంత కీలకమైన సమయమని బంగారు వ్యాపారి జయ్ రాథోడ్ తెలిపారు. ఈ ఏడాది కూడా వినియోగదారుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రాంతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు తిరిగి రావడం కూడా వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడటానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో బంగారం దరలు కాస్తా తగ్గడం కూడా కలిసి వచ్చిందన్నారు.
సాధారణంగా బహ్రెయిన్ బంగారు డిజైన్లను కోరుకునే కువైట్ మరియు ఖతార్ వంటి పొరుగు దేశాల నుండి వచ్చే కస్టమర్ల తాకిడి మితంగానే ఉందని, అయితే ఈద్ సమయంలో వారి సంఖ్య క్రమంగా పెరిగిందని మరో నగల వ్యాపారి కునాల్ రమేష్ తెలిపారు.
మొత్తం మీద ప్రస్తుత ఈద్ కాలాన్ని మనామా సూక్‌కు స్వాగతించదగిన ప్రోత్సాహంగా వ్యాపారులు అభివర్ణిస్తున్నారు. ఈద్ పండుగ కొత్త ఉత్సాహాన్ని, బలమైన అమ్మకాలను మరియు బంగారు మార్కెట్‌కు సానుకూల దృక్పథాన్ని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







