కువైట్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ

- May 28, 2026 , by Maagulf
కువైట్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ

కువైట్ సిటీ: కువైట్‌పై క్షిపణులు మరియు డ్రోన్ దాడులు జరుగుతున్నాయని ఆ దేశ సైన్యం గురువారం వెల్లడించింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ తక్షణమే స్పందిస్తూ దాడులను తిప్పికొట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

“శత్రు క్షిపణులు మరియు డ్రోన్ దాడులను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటోంది” అని కువైట్ సైన్యం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించింది.

ఇటీవల అమెరికా ఇరాన్‌ పై కొత్త వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించడంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.

ప్రస్తుతం పరిస్థితిని కువైట్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com