కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- May 28, 2026
కువైట్ సిటీ: కువైట్పై క్షిపణులు మరియు డ్రోన్ దాడులు జరుగుతున్నాయని ఆ దేశ సైన్యం గురువారం వెల్లడించింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ తక్షణమే స్పందిస్తూ దాడులను తిప్పికొట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
“శత్రు క్షిపణులు మరియు డ్రోన్ దాడులను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటోంది” అని కువైట్ సైన్యం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రకటించింది.
ఇటీవల అమెరికా ఇరాన్ పై కొత్త వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించడంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
ప్రస్తుతం పరిస్థితిని కువైట్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







