ప్రిన్స్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.!

- August 08, 2016 , by Maagulf
ప్రిన్స్ మహేష్ బాబుకు  జన్మదిన శుభాకాంక్షలు.!

అతడి చిరునవ్వులు అభిమానుల ఆనందాలు... ఆటపట్టిస్తూనే అమ్మాయిల మనసుల్ని దోచుకునే పోకిరి. బాక్సాఫీసు వద్ద ఖలేజా చూపిస్తూ, తనదైన దూకుడుతో రికార్డులను తిరగారయడంలో నంబర్ వన్ నేనే అంటూ రియల్ శ్రీమంతుడునని నిరూపించానుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. విభిన్నమైన సినిమాలతో, స్టైలిష్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సూపర్ స్టార్ బర్త్ డే నేడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన నటుడు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. అందం, అభినయం, ప్రయోగాత్మక కథలతో బాక్సాఫీసును షేక్ చేసే సినిమాలు, ఆకట్టుకునే అభినయానికి వరించిన అవార్డులు. ఇది మహేష్ గురించి సింపుల్ గా చెప్పాలంటే. నటశేఖర కృష్ణ,ఇందిరదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబు,నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా నీడ సినిమాతో పరిచయమయ్యాడు. దర్శకేంద్రుడు కె.రాఘవెంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంటర్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు. మురారి, ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్, 1 నేనొక్కడినే లాంటి ఎక్స్ పరిమెంటల్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మల్టీస్టారర్ మూవీస్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.సూపర్ స్టార్ గా అభిమానులను అలరిస్తున్న మహేష్,నమ్రత శిరోద్కర్ ను 2005 లో వివాహం చేసుకున్నాడు. మహేష్ బాబు తనయుడు గౌతం 1 నేనొక్కడినే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ టాప్ హీరోగా అలరిస్తున్న ఈ సూపర్ స్టార్ కు ఓవర్సీస్ లో వున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అలాగే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అక్కడ నెంబర్ నేనే అంటున్నాడు ప్రిన్స్. విభిన్నమైన సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న మహేష్ బాబు 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ ,3 సైమా అవార్డులను అందుకున్నాడు. 40 ఏళ్ళలోకి ఎంటర్ అవుతున్నా,ఇంకా కాలేజ్ కుర్రాడిలా తన చరిష్మాతో అలరిస్తున్న మహేష్ బాబు మురుగదాస్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తుండగా, ఈ సినిమా అభిమానులకు మరచిపోలేని తీపి గుర్తుగా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ బాబు రానున్న రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ మహేష్ బాబుకు మనం కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ ని అందిద్ధాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com