పీవీపీకి మహేష్‌ మాటిచ్చాడు

- August 08, 2016 , by Maagulf
పీవీపీకి  మహేష్‌ మాటిచ్చాడు

బ్రహ్మోత్సవంతో పీవీపీ సినిమా సంస్థకి బొప్పి కట్టిన సంగతి తెలిసిన విషయమే. రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమాకి పట్టుమని పాతిక కోట్లు కూడా రాలేదు. ఆ సినిమా తీసిన వీవీపీనే కాదు, భారీ రేట్లకు కొన్న బయ్యర్లూ పూర్తిగా నష్టపోయారు. ఆ సమయంలోనే ఆ సంస్థలో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు మహేష్‌. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకొన్నాడు. పీపీవీ లో మహేష్ మరో సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. దీనికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. రేపు (మంగళవారం) మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ తో కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది పీవీపీ. 2017 ఏప్రిల్లో ఈ సినిమా మొదలెడతారట. 2018లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కోసం మహేష్ పారితోషికంలో రిబేటు కూడా ఇచ్చాడని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాని పూర్తి చేయమని, తద్వారా బ్రహ్మోత్సవం నష్టాన్ని పూడ్చుకోవొచ్చని మహేష్ సలహా ఇచ్చాడట. నష్టపోయిన నిర్మాతని ఈ విధంగా ఆదుకోవడం కూడా గొప్పే. అందుకే మహేష్‌ని చూసి అభిమానులే కాదు.. పీవీపీ సంస్థ కూడా పొంగిపోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com