జోర్డాన్ నుంచి అబుదాబీకి ఒమన్ ఎయిర్ విమానం మళ్ళింపు
- August 09, 2016
ఒమన్ ఎయిర్‌కి చెందిన విమానం డబ్ల్యువై 414 మళ్ళించబడింది. అమ్మన్, జోర్డాన్ నుంచి మస్కట్‌కి వెళ్ళాల్సిన ఈ విమానం అబుదాబీకి డైవర్ట్ చేయబడింది. సాంకేతిక కారణాలతో ఈ మళ్ళింపు జరిగినట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు అధికారికంగా వెబ్సైట్ ద్వారా వెల్లడించాయి. అమ్మమన్ నుంచి సాయంత్రం 7.50 నిమిషాలకు ఆదివారం టేకాఫ్ అయి, మస్కట్‌కి తెల్లవారుఝామున 12.20 నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం అబుదాబీ ఇంటర్నేషయల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 4 గంటలకు ల్యాండ్ అయ్యింది. ప్రయాణీకులు ఈ మళ్ళింపుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఉదయం 10.45 నిమిషాలకు అబుదబీ నుంచి మస్కట్‌కి విమానం బయల్దేరినట్లు ఒమన్ ఎయిర్ వర్గాలు వివరించాయి. జులై 28న చెన్నయ్‌కి వెళ్ళాల్సిన ఒమన్ ఎయిర్ విమానం మస్కట్ నుంచి వెళుతూ గోవాలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమాన ప్రయాణీకుడికి అస్వస్థత తలెత్తడంతో ఎమర్జన్సీ ల్యాండ్ చెయ్యాల్సి వచ్చింది. ప్రయాణీకురాలు ఒకరు తీవ్ర గుండెనొప్పితో బాధపడ్డారు. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







