ఉత్తర ప్రదేశ్‌లో యాంటీ టెర్రరిజం కోర్సు!
- August 09, 2016
ఉత్తర ప్రదేశ్‌లోని ఓ మదర్సా సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ ఇవ్వబోతోంది. ఇది రెండేళ్ళ కాల పరిమితిగల కోర్సు. దర్గా ఏ అలా హజ్రత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సున్నియత్ జామియా రజ్వియా మంజర్ ఏ ఇస్లామ్‌లో దీనిని ప్రవేశపెడుతున్నారు. ఉగ్రవాదులు మత గ్రంథాలను తమ కుట్రలకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నదీ ఈ కోర్సులో చేరిన ముస్లింలకు తెలియజేస్తారు. ఉగ్రవాద సంస్థల నేపథ్యాన్ని, అమాయకులను తప్పుదోవ పట్టించడానికి అవి చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరిస్తారు. మన దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి తెలియజేస్తారు. దర్గా ఏ అలా హజ్రత్ అధికార ప్రతినిధి, హెడ్ కన్వీనర్ ముఫ్తి సలీం నూరి మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ పాపపు పనులను సమర్థించుకునేందుకు మత గ్రంథాలను దుర్వినియోగపరుస్తున్నారన్నారు. దీనిని ఎదుర్కొనేందుకే ఈ కోర్సును ప్రారంభిస్తున్నామన్నారు. దీనికి యాంటీ టెర్రరిజం కోర్సు అని పేరు పెట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







