ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ

- May 31, 2026 , by Maagulf
ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ

యూఏఈః యూఏఈలో ప్రజారోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, దేశంలో ఆందోళన కలిగించే ఎలాంటి సూచనలు లేవని జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ప్రకటించింది. ఈమేరకు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), అత్యవసర నిర్వహణ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపింది. ఎబోలా వైరస్‌కు సంబంధించిన తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా తలెత్తే ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి యూఏఈ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఉగాండా, కాంగో లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తత ప్రకటించాయి. అత్యవసరం అయితే తప్ప ఎబోలా ప్రభావిత దేశాలైన ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్‌లకు ప్రయాణించవద్దని యూఏఈ తన పౌరులకు సూచించింది. కాగా, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ప్రవేశాన్ని బహ్రెయిన్, జోర్డాన్ నిలిపివేశాయి. మరోవైపు ఎబోలాకు సంభావ్య చికిత్సలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. బండిబుగ్యో ఎబోలా రకానికి మూడు ప్రయోగాత్మక చికిత్సలను గుర్తించినట్టు వెల్లడించింది. మ్యాప్ బయోఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన MBP134, రీజెనెరాన్ వారి మాఫ్టివిమాబ్ మరియు గిలియడ్ సైన్సెస్ వారి యాంటీవైరల్ రెమ్డెసివిర్ లపై కూడా క్లినికల్ ట్రయల్స్ చేయాలని సిఫార్సు చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com