ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- May 31, 2026
యూఏఈః యూఏఈలో ప్రజారోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, దేశంలో ఆందోళన కలిగించే ఎలాంటి సూచనలు లేవని జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ప్రకటించింది. ఈమేరకు ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), అత్యవసర నిర్వహణ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపింది. ఎబోలా వైరస్‌కు సంబంధించిన తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలను సమీక్షిస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా తలెత్తే ప్రజారోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి యూఏఈ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఉగాండా, కాంగో లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తత ప్రకటించాయి. అత్యవసరం అయితే తప్ప ఎబోలా ప్రభావిత దేశాలైన ఉగాండా, కాంగో, దక్షిణ సూడాన్‌లకు ప్రయాణించవద్దని యూఏఈ తన పౌరులకు సూచించింది. కాగా, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ప్రవేశాన్ని బహ్రెయిన్, జోర్డాన్ నిలిపివేశాయి. మరోవైపు ఎబోలాకు సంభావ్య చికిత్సలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది. బండిబుగ్యో ఎబోలా రకానికి మూడు ప్రయోగాత్మక చికిత్సలను గుర్తించినట్టు వెల్లడించింది. మ్యాప్ బయోఫార్మాస్యూటికల్ అభివృద్ధి చేసిన MBP134, రీజెనెరాన్ వారి మాఫ్టివిమాబ్ మరియు గిలియడ్ సైన్సెస్ వారి యాంటీవైరల్ రెమ్‌డెసివిర్ లపై కూడా క్లినికల్ ట్రయల్స్ చేయాలని సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







