యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!

- May 31, 2026 , by Maagulf
యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!

మక్కా: 2026 హజ్ సీజన్‌కు సంబంధించి ఆరోగ్య పరమైన కార్యకలాపాలు విజయవంతంగా ముగిశాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాత్రికులలో ఎటువంటి అంటువ్యాధులు లేదా ప్రజారోగ్య ముప్పులు నమోదు కాలేదని ధృవీకరించింది. సీజన్ ప్రారంభం నుండి వైద్య బృందాలు యాత్రికులకు 25 లక్షలకు పైగా ఆరోగ్య సేవలను అందించాయి.

ఆరోగ్య కేంద్రాలు మరియు అత్యవసర సంరక్షణ సౌకర్యాల ద్వారా 1,14,889 మంది ప్రయోజనం పొందగా, అత్యవసర విభాగాలలో 58,462 కేసులకు మరియు ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో 29,846 మంది రోగులకు చికిత్స అందించినట్లు మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

అలాగే, 8,342 మంది రోగులు ఆసుపత్రులలో చేరారు. ప్రత్యేక బృందాలు 410 శస్త్రచికిత్సలు నిర్వహించాయి. వీటిలో 323 కార్డియాక్ కాథెటరైజేషన్లు మరియు 33 ఓపెన్-హార్ట్ సర్జరీలు ఉన్నాయి. ఆరోగ్య అధికారులు అవగాహన మరియు నివారణ ప్రచారాలను కూడా ముమ్మరం చేసి, 292,585 కంటే ఎక్కువ నివారణ సేవలను అందించారు. యూనిఫైడ్ 937 కాల్ సెంటర్ ఒక మిలియన్ కంటే ఎక్కువ కాల్స్‌ను స్వీకరించి, ఏడు భాషలలో నిరంతర వైద్య మరియు సలహా సహాయాన్ని అందించింది.

ఈ సంవత్సరం హజ్ యాత్రలో కీలకమైన మెడిసిన్స్ మరియు పరికరాలను వేగంగా రవాణా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించారు. ప్రత్యేక నైపుణ్యం గల సర్జన్లు సంక్లిష్టమైన ప్రక్రియల కోసం మెడికల్ రోబోటిక్స్‌ను కూడా ఉపయోగించారు.  అదే సమయంలో స్మార్ట్‌వాచ్‌లు అధిక ప్రమాదం ఉన్న యాత్రికుల కీలక ఆరోగ్య సూచికలను రిమోట్‌గా పర్యవేక్షించాయని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com