వంశీపైడిపల్లి చిత్రంలో మహేష్ ...
- August 09, 2016
మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నట్లు టాక్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించబోయే సినిమా పూరిజగన్నాథ్ డైరెక్షన్ లోనా? లేక..? కొరటాల శివ డైరెక్షన్ లోనా అనేది కొంచెం డౌట్ గా ఉండగా, తాజాగా ఇంకో న్యూస్ బయటకు వచ్చింది.మహేష్ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని అంగీకరించారు. ఇటీవల నాగార్జున, కార్తి కలిసి నటించిన ఊపిరి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. పి.వి.పి సినిమా పతాకంపై పరల్ వి. పొట్లూరి సమర్పణలో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించిన తీరు మహేష్‌ను ఆకట్టుకోవడంతో ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మురుగదాస్‌తో చేస్తున్న సినిమా తరువాత వంశీపైడిపల్లి చిత్రం సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. అమెరికా నేపథ్యంలో చిత్ర కథ ఉండగా, షూటింగ్ దాదాపు అమెరికాలోనే జరగనున్నట్టు సమాచారం. నేడు మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పి.వి.పి సినిమా వర్గాలు తాజా చిత్రాన్ని పోస్టర్ ద్వారా ప్రకటించాయి.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







