కుమారుల వివాహం గురించి నాగ్ పూర్తి స్పష్టత..
- August 09, 2016
గత కొన్నాళ్ళుగా టాలీవుడ్లో హాట్ టాపిక్ ఏంటంటే అక్కినేని హీరోల మ్యారేజ్ మేటర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం బ్యాచిలర్స్‌గా ఉన్న చైతూ, అఖిల్‌లు త్వరలో ఒకింటి వారు కాబోతున్నారని, ఇద్దరి పెళ్ళిళ్ళు నాగ్ ఒకేసారి చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంక చైతూ- సమంత మ్యారేజ్ విషయంలో నాగ్ కాస్త మొహం చాటేస్తున్నాడని కూడా వార్తలు కూడా వచ్చాయి. వీటిపై నాగ్ పూర్తి స్పష్టత ఇచ్చాడు.టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ నెలలో తన 57వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా విషయాలతో పాటు తన కుమారుల వివాహం గురించి కూడా మాట్లాడారు. ఇద్దరు పెళ్ళిళ్ళను ఒకే వేదికపై తాను చేయాలనుకోవడం లేదని, వేరు వేరు వివాహాల ద్వారా వచ్చే ఆనందాన్ని తాను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నట్టు తెలిపాడు. చైతూ, అఖిల్ పెళ్లి విషయంలో వారికి మార్గదర్శకుడిగా ఉంటానే తప్ప నిర్ణేతను కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం చైతూ, అఖిల్‌లు వారి వారి కెరియర్ల పరంగా సక్సెస్ రూట్లోనే వెళుతుండగా, అఖిల్ ఓ పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని నాగార్జున అన్నారు. చైతూ విషయానికి వస్తే సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విడుదలకి రెడీ కాగా, ప్రేమమ్ కూడా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ లవర్ బోయ్ సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్వకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. నాగ్ ఓం నమో వెంకటేశాయ అనే భక్తిరస చిత్రంలో హథీరాంబాబాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







