అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్‌ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!

- June 01, 2026 , by Maagulf
అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్‌ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!

దోహా: అల్ ఖోర్ మరియు అల్ తఖిరా మునిసిపాలిటీల ప్రాతినిధ్యంతో ఈద్ అల్-అధా వేడుకలలో భాగంగా అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్‌ లో ఖతార్‌లో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛగా ఎగిరే చిలుకల ప్రదర్శనను(ఫ్రీ ఫ్లైట్ పారట్) ఖతార్ మునిసిపాలిటీల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఇది సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి అందిస్తుందని తెలిపింది.

ఈ ప్రదర్శనలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “లాండర్ వరల్డ్ ప్యారెట్స్” బృందం పాల్గొంటుంది. వారి శిక్షణ పొందిన చిలుకలు బహిరంగ వాతావరణంలో గగన విన్యాసాలు మరియు ఇంటరాక్టివ్ విన్యాసాలను ప్రదర్శించారు. ఖతార్‌లో ఇటువంటి స్వేచ్ఛగా ఎగిరే పక్షుల ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

ఇది అన్ని వయసుల సందర్శకులను ఆకట్టుకునే వినూత్న కార్యకలాపాలను పరిచయం చేయడం ద్వారా ఈద్ సెలవుల అనుభవాన్ని సుసంపన్నం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com