ఆరు నెలలకే తొలగింపు.. కోల్‌కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- June 01, 2026
కోల్‌కతా: అర్జెంటీనా 2022 ప్రపంచకప్ విజయం సందర్భంగా మెస్సీకి నివాళిగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2025 డిసెంబర్లో (Lionel Messi Statue) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెస్సీ వర్చువల్‌గా దీనిని ఆవిష్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కోల్‌కతాలో ఫుట్‌బాల్‌కు ఉన్న ప్రత్యేక ఆదరణకు ఈ విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని అభిమానులు భావించారు. అయితే ఆవిష్కరించిన కొద్ది నెలల్లోనే విగ్రహాన్ని తొలగించాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం కాకుండా ఎకో పార్క్ వంటి మరింత సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







