షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- June 02, 2026
యూఏఈ: షార్జా లోని ఒక రెసిడెన్సీ టవర్లోని మెట్లపై నుంచి పడి మరణించిన రెండేళ్ల బాలుడి మృతి చెందాడు. ఈ దుర్ఘటనపై షార్జా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న నివాసితులు మరియు ప్రాపర్టీ మేనేజర్లు ఎత్తైన భవనాలలో పిల్లల భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. ఈ ఘటన క్షణాల్లో జరిగిపోయిన ఒక ఘోర విషాదమని కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతి చెందిన బాలుడు పాకిస్తానీ కుటుంబానికి చెందిన వాడిగా గుర్తించారు. చనిపోవడానికి ముందు ఆ బాలుడు అపార్ట్మెంట్ బయటకు వెళ్లి, భవనంలోని పై అంతస్తులో ఉన్న మెట్ల ప్రాంతం దగ్గర ఆడుకుంటుండగా ఒక సందులోంచి కింద పడిపోయాడు. అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే గాయాలతో ఆ బాలుడు మరణించాడు. ఈ ప్రమాదం చాలా తక్కువ సమయంలో జరిగిందని, నివాస స్థలాల్లో చిన్న పిల్లలు ఎంత వేగంగా అసురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురవుతారో ఈ సంఘటన తెలియజేస్తోందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, బాలల సంరక్షణ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







