ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- June 02, 2026
దోహా: ఖతార్ లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఫుడ్ కోర్టులను ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. మున్సిపల్ ఆరోగ్య నియంత్రణ బృందాలు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారులు సీజ్ చేసిన సంస్థలలో 'కెఫెటేరియా అల్ నైమి' (మూడు రోజుల పాటు మూసివేత), 'పారిస్ హైపర్మార్కెట్ బుచరీ' ( 45 రోజుల పాక్షిక మూసివేత), 'షై ఎక్స్ప్రెస్ రెస్టారెంట్' (15 రోజుల పాటు మూసివేత) ఉన్నాయి. ఈ సంస్థలు ప్రజా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేని పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేస్తున్నాయని, అలాగే ఖతార్ ఆహార నియంత్రణ చట్టాల కింద నిర్దేశించిన ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!







