అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- June 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో మే నెలకు సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి మొత్తం 160 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) తెలిపింది. దేశవ్యాప్తంగా 2,365 తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు పేర్కొంది. అలాగే, హజ్ సీజన్ సందర్భంగా పవిత్ర స్థలాలు మరియు సేవా కేంద్రాలలో సుమారు 15వేల తనిఖీ పర్యటనలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ తనిఖీలలో 480 మంది ఉద్యోగులకు సంబంధించిన అనుమానిత కేసులపై దర్యాప్తు జరిపి, 160 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది.
అరెస్టు అయిన వారిలో మున్సిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్ వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో పాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీకి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని వెల్లడించింది. వీరిపై లంచం తీసుకోవడం మరియు తమ అధికారిక హోదాలను దుర్వినియోగం చేయడం వంటి కేసులను నమోదు చేసినట్టు అవినీతి నిరోధక సంస్థ (నజాహా) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







